దావోస్ లో సీఎం జగన్- కేటీఆర్ భేటీ.. ఫోటోలు వైరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ గడ్డపై కలుసుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం జగన్ తో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. వారు కలిసిన ఫోటోలను ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రాగా.. పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. ఆయన స్విజర్లాండ్, లండన్ లో పర్యటించారు. ఈ క్రమంలో జగన్, కేటీఆర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వీరి భేటీలో ఏ అంశాలపై చర్చించారో తెలియరాలేదు.

మరోవైపు పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పలువురు ప్రతినిధులను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ కూడా పెట్టుబడుల కోసం ఆయన విదేశాల్లో పర్యటించారు. పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు, పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.