మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్

-

మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హోం ఐసోలేషన్ లో వున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ కి కరోనా సోకగా… గోవా గవర్నర్‌ కి మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక శివసేన పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీ కానుంది.

కాగా… మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తన అనుచర ఎమ్మెల్యేలతో సూరత్ వెళ్లిన రాష్ట్ర మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు అసోం కు చేరింది. ఈ ఉదయం వీరంతా చార్టెడ్ విమానంలో గౌహతికి చేరుకున్నారు. గౌహతి ఎయిర్ పోర్టులో బిజెపి ఎంపీలు వల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గేహెన్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు.

 

Read more RELATED
Recommended to you

Latest news