నిరుద్యోగుల ఆశాజ్యోతిగా సీఎం యోగీ

-

నిరాశ,నిస్పృహలతో నిండిన మా జీవితాల్లో వెలుగులు నింపావ్… అచేతనంగా పడివున్న మా బ్రతుకుల్లో చైతన్య కాంతులు నింపి ఆశాజ్యోతిగా మారావ్… ఈ కాలపు సూర్యుడిలా కనిపించే నువ్వు పేదల పాలిట ఆత్మ బంధువుగా నిలిచావ్…శిథిలమైన మా కలలకు మరోసారి జీవం పోశావ్….. ఇవీ యోగి ప్రభుత్వం యొక్క పారదర్శక మరియు న్యాయమైన రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన హనుమంత్ ప్రసాద్ సింగ్ భావోద్వేగ భరిత మాటలు.సచివాలయ పరిపాలనా విభాగం రివ్యూ ఆఫీసర్ పోస్టుకు అపాయింట్‌మెంట్ లెటర్ పొందిన హనుమంత్ సీఎం యోగి ఆరేళ్లలో తెచ్చిన సంస్కరణల కారణంగా వరుసగా నాలుగు పరీక్షల్లో విజయం సాధించాడు.ఏపీలో అర్హులైన వారిని వెతికి మరీ సంక్షేమ పథకాలు అందించినట్టు యూపీలో లక్షల మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

ఒక్క హనుమంత్ మాత్రమే కాదు ఉద్యోగాలు పొందుతున్న యువశక్తిలో ప్రస్తుతం ఈ భావన ఉంది. గత ప్రభుత్వాలు యువతను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పిన ఉద్యోగులు యోగీ వచ్చాక నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. సిఎం యోగీ న్యాయమైన మరియు పారదర్శకమైన నియామక ప్రక్రియ కారణంగా ఉద్యోగాలు పొందుతున్నామని తాజాగా అపాయింట్ పొందిన వారి అభిమతం. ముత్తానికి యూపీ సంరక్షకుని లాంటి విజయవంతమైన ముఖ్యమంత్రిని పొందిందని కొనియాడుతున్నారు.

నెల రోజుల్లో 11 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు ముఖ్యమంత్రి. యోగి ప్రభుత్వం ఉంటే నియామకాల్లో ఎలాంటి అవకతవకలు ఉండదనే నమ్మకం యువతలో ఉంది. ఇదొక్కటే కాదు సచివాలయ పరిపాలనా విభాగం, రవాణా సంస్థ, ఎన్నికల విభాగం, క్రీడలు, పోలీసు, ఆరోగ్యం, విద్య సహా అన్ని విభాగాల్లో నియామక పత్రాలు ఇస్తున్నారు.నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో అర్హత ప్రాతిపదికన, ప్రాంతం, కులాలకు అతీతంగా ఎంపిక జరిగిందని తాజా ఉద్యోగులు చెప్తున్నారు.
యోగి ప్రభుత్వం నియామక పత్రాల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. 2022 సంవత్సరం నుండి అమలవుతున్న అపాయింట్‌మెంట్ లెటర్ పంపిణీ కార్యక్రమం కింద ఎనిమిది నెలల్లో ఇది 10వ అపాయింట్‌మెంట్ లెటర్ పంపిణీ కార్యక్రమం. ఇప్పటి వరకు 21,500 మందికి పైగా అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు పంపిణీ చేసింది. రానున్న రోజుల్లో పలు విభాగాల్లో కొత్తగా ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version