జూన్ 21న యూపీలో పెద్ద ఎత్తున యోగా ఈవెంట్‌లు: CM యోగీ

-

మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన శాస్త్రమే యోగా. ఆరోగ్యకరమైన జీవన ప్రక్రియ కళ యోగా. యోగ సాధన ద్వారా వ్యక్తి చేతనకి, విశ్వ చైతన్యానికి,అలాగే మనిషికి ప్రకృతికి మధ్య సమన్వయము సిద్ధిస్తుంది. ఇంతటి మహత్తు యోగా ప్ర్రక్రియలో దాగి ఉంది కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారం కల్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులోని ప్రాముఖ్యతను గమనించిన విదేశీయులు పెద్ద ఎత్తున యోగా సాధనకు శ్రీకారం చుట్టారు.

CM యోగీ
CM యోగీ

అటు ఐక్యరాజ్య సమితి కూడా యోగాను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు యోగా సాధన ప్రపంచంలో ఒక ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. దీర్ఘకాలిక వ్యాధులను యోగా ద్వారా నయం చేసుకోవచ్చని తెలిసి అనేక మంది విదేశీయులు సాధన చేస్తున్నారు. ఇదంతా ప్రధాన మంత్రి మోడీ యోగాకు తీసుకువచ్చిన ప్రాచుర్యమే కారణం.ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు యావత్తు ప్రపంచం సిద్ధమైంది.

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పెద్ద ఎత్తున యోగా ఈవెంట్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,000 గ్రామ పంచాయతీలు, 762 పట్టణ సంస్థలు, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో గ్రూప్ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలల్లో కూడా వివిధ పోటీలు నిర్వహించనున్నారు. మంత్రులు వారి జిల్లాల పరిధిలో కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని “హర్ ఘర్-అంగన్ యోగా,” అనే థీమ్‌తో ప్రతి కుటుంబానికి చేరువ చేసేందుకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో పలు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మంత్రులందరూ తమ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు.”అమృత్ సరోవర్”, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను యోగా సాధన కోసం కూడా ఉపయోగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక పత్రికా ప్రకటన వెలువడింది.

“ప్రజలలో అవగాహన పెంచడానికి స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు, మతపరమైన, సామాజిక సంస్థలు మరియు యోగా సంస్థల సహకారం తీసుకోండి” అని సమీక్షలో యోగి చెప్పారు. జూన్ 15-జూన్ 21 వరకు యోగా యొక్క ప్రయోజనాలను ఎక్కువ సంఖ్యలో ప్రజలకు తీసుకురావాలనే లక్ష్యంతో “యోగా వీక్” గా పాటించాలని సిఎం తెలిపారు.పబ్లిక్ పార్కులలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు గ్రూప్ యోగా ప్రాక్టీస్ చేయాలన్నారు.యోగాకు సంబంధించిన సెమినార్య లేదా వర్క్‌షాప్‌లను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు పాఠశాలల్లో నిర్వహించాలి, వీటిలో ఆధునిక జీవనశైలిలో యోగా పాత్ర, మానసిక రుగ్మతల నిర్వహణలో యోగా పాత్ర,ప్రసంగ పోటీలు, రంగోలి లేదా పోస్టర్ పోటీలు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.మొత్తం 14 వేల వార్డుల్లో కార్పొరేటర్ల ద్వారా యోగాకు స్థలాలు గుర్తించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news