బీహార్లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్

-

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బీహార్ రాష్ట్రం బాగల్ పూర్ జిల్లాలోని సుల్తాన్ గంజ్ మధ్య గంగా నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఈ బ్రిడ్జిపై చాలామంది కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో ఎంతమంది చనిపోయారు… ఎంతమంది బతికి ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు.

వారిలో చాలామంది చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే భాగల్పూర్ జిల్లా యంత్రాంగం కానీ, బీహార్ ప్రభుత్వం కానీ, ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సుల్తాన్ గంజ్-కగారియా మధ్య ఉన్న ఈ వంతెన గతేడాది కూడా కూలిపోయింది. ఆ సమయంలో ఈదురు గాలులు వేయడంతో వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. నిర్మాణ సంస్థ ‘ఎస్కే సింగ్ల’పై చర్యలు తీసుకుంటామని బీహార్ ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news