HYD శివారులోని కోకాపేటలో నిర్మించనున్న BRS ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ఆర్డి’ భవనానికి CM KCR ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ శ్రేణులకు రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతుల నిర్వహణతో పాటు వారికి సమగ్రమైన సమాచారం లభించేలా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భవనం ఉండనుంది. అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ సహా అత్యాధునిక హంగులతో కూడిన సదుపాయాలు కల్పించనున్నారు.
కాగా,వానకాలం సీజన్ కు రైతుబంధు కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని గతంలో కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకొనున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లకు ఎకరానికి రూ. 5000 చొప్పున ఏటా రూ. 10వేల సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వానాకాలం సీజన్ కు జూన్ చివర్లో, జూలై మొదటి వారంలో నిధులు విడుదల చేస్తుండగా, ఇకపై ముందుగానే అందించనుంది.