నేడు కాంగ్రెస్ పార్టీ అత్యవసర విస్తృత సమావేశం జరుగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ కి రెండేళ్ళ జైలు శిక్ష నేపధ్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చ జరుగనుంది.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. “స్టీరింగ్ కమిటీ” ( సిడబ్ల్యుసి) జనరల్ సెక్రటరీ లు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలు సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే సమావేశానికి రాలేకపోతున్న నేతలు “ఆన్ లైన్” లో నైనా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది.