దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఇప్పటికే మొదలైందని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆగస్టు చివరి నుంచి కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు కొందరు నిపుణులు మాత్రం కోవిడ్ మూడో వేవ్ ఇక రానట్లేనని అంటున్నారు.
దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే కేరళ, మహారాష్ట్రలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రానున్న రోజుల్లో వాటి సంఖ్య తగ్గుతుందని అన్నారు. దేశం మొత్తంగా చూస్తే కోవిడ్ తీవ్రత అంతంతమాత్రమే ఉందని అన్నారు. అందువల్ల కోవిడ్ మూడో వేవ్ రానట్లేనని అన్నారు.
ఇక ఇదే విషయమై ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అయితే కోవిడ్ జాగ్రత్తలను పాటించడం మాత్రం తప్పనిసరి అని అన్నారు.
అయితే కేరళలో మొదలైన నిపా ప్రభావం తమిళనాడుకు వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిపా వైరస్ ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీన్ని కట్టడి చేయకపోతే చాలా మంది ప్రాణాలు పోయేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు.