జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గాం జిల్లాలో ఐటిబిపి జవాన్లతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 8 మంది ఐటిబిపి జవాన్లు మృతి చెందగా,30 మందికి గాయాలు అయ్యాయి. ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఉదయం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది బస్సు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం తోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది జవాన్లు ఉన్నట్లుగా సమాచారం.
అమర్నాథ్ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో ఐటిబిపి జావాన్ల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఐటీబీపీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని అన్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభాతి తెలిపారు ముర్ము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి. ఐటిబిపి జావాన్ల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు కేంద్రమంత్రులు.