ఎంత నిర్లక్ష్యం.. ఐస్‌ క్రీమ్‌ బండిపైకి దూసుకెళ్ళిన BMW కారు

-

రోడ్డుపై ఐస్‌క్రీమ్‌ కొందామని ఓ మహిళ BMW కారులో వచ్చింది. ఒక్కసారిగా కారు ఐస్‌క్రీమ్‌ బండిపైకి దూసుకుపోయింది. ఈ దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకోగా, ఐస్‌క్రీమ్‌ అమ్ముతున్న వ్యక్తితో పాటు, పక్కన ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఐస్‌క్రీమ్‌ అమ్మతున్న వ్యక్తి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే తనతో పాటు ఉన్న తన పెంపుడు కుక్క ఒక్కసారిగా బయటికి దూకటంతో కారు అదుపుతప్పినట్లు ఆ మహిళ తెలిపింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి నలుగురికి గాయాలకు కారణం అయినట్లుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఆమె నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపైన జీవనం కొనసాగించే వారి ప్రాణాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఘటనకు కారణమైన మహిళను వదలొద్దంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news