ఆవు మూత్రం తాగితే కరోనా రాదని ఈ మధ్యే ఓ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఓ వీడియోలో మూత్రం తాగి చూపించారు. అయితే మరో బీజేపీ ప్రజా ప్రతినిధి కూడా సరిగ్గా అవే వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ ఠాకూర్ మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. ఆవు మూత్రం తాగితే కరోనా రాదని అన్నారు.
భోపాల్‌లోని సంత్ నగర్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ హెగ్డెవార్ హాస్పిటల్‌కు ఆమె 25 ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రోజూ ఆవు మూత్రం తాగుతున్నానని, తనకు కరోనా రాలేదని తెలిపారు. ఆవు మూత్రం తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తగ్గుతుందన్నారు. త్వరలో తాను 1 కోటి మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.
కాగా ఎంపీ సాధ్వి ఇంట్లో పనిచేసే సిబ్బంది అందరూ కోవిడ్ బారిన పడ్డారు కానీ ఆమెకు కరోనా రాకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆవు మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని గతంలో సైంటిస్టులే ధ్రువీకరించారు. కానీ కరోనాపై వారు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. అయినప్పటికీ కొందరు మాత్రం కరోనా రాకుండా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలని చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.