నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. అందరి చూపూ ఆ రాష్ట్రంపైనే

-

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాక్ఖడ్ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీనికోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కౌంటింగ్ ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు.

యూపీలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉండగా…. పంజాబ్ ఎన్నికల ఆప్‌ గెలిచే ఛాన్స్‌ ఉంది. ఫిబ్రవరి 20 న జరిగిన ఇక్కడ ఎన్నికలు జరుగగా… 1304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 117 సీట్లలో , ఆప్ 117 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరంజిత్ సింగ్ చన్నీ, ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఉండగా.. శిరోమణి ఆకాలి దళ్, బీఎస్పీ కలిసి పోటీ చేసాయి…

ఆకాలి దళ్ 97 నియోజక వర్గాల్లో బీఎస్పీ 20 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి ఆకాలి దళ్ ఎస్ లు కలిసి పోటీ చేసాయి… బీజేపీ 73 స్థానాల్లో , పంజాబ్ లోక్ కాంగ్రెస్ 28, శిరోమణి ఆకాలి దళ్ ఎస్ 15 స్థానాల్లో పోటీ చేసింది. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ముందు మొదలు…. సమాంతరంగా evm ల కౌంటింగ్ ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 11 గంటల వరకు ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news