దేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం

-

దేశంలో చెరుకు పంట దిగుబడి తగ్గుతుందనే అంచనాలతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మరోవైపు ఇథనాల్ ఉత్పత్తిని పోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మొలాసిస్‌ ఎగుమతులపై 50 శాతం సుంకం విధించింది. జనవరి 18వ తేదీ నుంచి పెంచిన ఈ సుంకం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్‌లో విడుదల చేసింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపేందుకు కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకే మొలాసిస్‌పై 50శాతం ఎగుమతి సుంకం విధించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది పెట్రోల్‌లో 15శాతం ఇంథనాల్‌ కలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసందే. తద్వారా చమురు దిగుమతుల బిల్లు తగ్గుతుందని చెబుతోంది. గత ఏడాది చెరుకు ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నులు ఉండగా ప్రస్తుత సీజన్‌లో 32.2 నుంచి 33 మిలియన్ టన్నులు మాత్రమే చెరుకు ఉత్పత్తి ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. ముడి, శుద్ధిచేసిన వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు  2025 మార్చి 31 వరకూ వర్తిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మరో నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశంలో వంట నూనెల ధరలు అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version