దేశంలో తొలి మంకీపాక్స్ అనుమానిత మరణం నమోదైంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
మృతుడు జులై 21న యూఏఈ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. యూఏఈలో యువకుడికి అప్పటికే మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని తెలిపారు.
భారత్ కు వచ్చిన తర్వాత వైరస్ నిర్ధారణ కోసం యువకుడి నమూనాలను అలప్పుళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి పంపించినట్లు అధికారులు చెప్పారు.
యువకుడు వచ్చిన నాటి నుంచి తిరిగి ప్రదేశాల గురించి వివరాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. వైరాలజీ ల్యాబ్ ఇచ్చే ఫలితం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయితే నమూనాలను పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. యువకుడితో కాంటాక్ట్ లో ఉన్న వారందరూ ఐసోలేషన్ ఉండాలని కోరారు.
దేశంలో మంకీపాక్స్ మరణంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మహమ్మారి లక్షణాలు కలిగిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. బాధితులతో కాంటాక్ట్ లో ఉన్నవారు ఐసోలేషన్ కు వెళ్లాలని చెప్పింది.