కేంద్రం సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌ నుంచి భారతీయులకు ఉచితంగా విమాన ప్రయాణాలు

-

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రయాణ ఛార్జీలు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాలని సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్.

ఇక అటు ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే 2 వేల మందికి పైగా ఇండియన్స్‌ ను ఉక్రెయిన్‌ నుంచి రప్పించింది కేంద్రం.

కాగా.. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన రష్యన్ బలగాలు.. చివరకు రాజధానిని స్వాధీనం చేసుకున్నాయి. ఈరోజు ఉదయం కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో మోహరించిన రష్యన్ ఆర్మీ వేగంగా.. కీవ్ లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ కు సంబంధించిన స్నేక్ ఐలాండ్ ను రష్యన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కీవ్ నగరంలోని అధికారిక భవనాలపై రష్యా జెండాను ఎగరేశారు.

Read more RELATED
Recommended to you

Latest news