ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఫ్రీ.. కానీ కండిషన్స్ అప్లై

-

రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట ధరల పెరుగుదలతో వీటి చుట్టూ జరుగుతున్న కథలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన చండీగఢ్​లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ప్రయాణికులకు వెరైటీ ఆఫర్ ప్రకటించాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే..?

చండీగఢ్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ అరుణ్‌ తన ఆటోలో ప్రయాణించేవారికి ఉచితంగా కిలో టమాటాలు అందిస్తున్నాడు. ఇందుకు అతను ఓ కండిషన్ పెట్టాడు. అదేంటంటే.. తన ఆటోలో కనీసం అయిదుసార్లు ప్రయాణించిన వారికే ఈ సదుపాయం కల్పిస్తున్నాడు. గత 12 ఏళ్లుగా ఆటో నడుపుతున్న అరుణ్‌ దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలకు తన వంతు సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఆటో వెనుక అరుణ్‌ అంటించిన టమాటా పోస్టర్‌ వైరల్‌గా మారింది. తన ఆటోలో గర్భిణులకు, ప్రమాద బాధితులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నందుకు చండీగఢ్‌ పోలీసుల నుంచి ఈయన సత్కారం కూడా అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version