ప్రధాని నరేంద్ర మోడీకి జర్మనీ ఘన స్వాగతం

-

జూన్ 26, 27 తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీకి జర్మనీలోని మ్యూనిచ్ కు చేరుకున్న ఆయనకు బవేరియస్ బ్యాండ్ స్వాగతం పలికింది.ప్రధాని ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జర్మనీలో రెండు రోజులు, యూఏఈలో ఒకరోజు పాటు ఈ పర్యటన కొనసాగనుంది అని తెలిపింది. జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కొల్ట్ ఆహ్వానం మేరకు ప్రధాని జీ7 సదస్సుకు హాజరు కానున్నారు.

మోడీ ఈ సమావేశంలో పర్యావరణం, ఎనర్జీ, వాతావరణం, ఆహార భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్యం, ప్రజాస్వామ్యం అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో దక్షిణ జర్మనీలోని ఆల్ ఫైన్ క్యాజిల్ ఆఫ్ శ్లోష్ ఎల్మారాను సందర్శిస్తారు. అనంతరం ప్రధాని జూన్ 28న జర్మనీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నారు. యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మరణించినందుకు ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news