IPL 2023 ఫైనల్ కు గుజరాత్ చేరింది. క్వాలిఫైడ్-2 మ్యాచులో ముంబైపై గుజరాత్ 62 రన్స్ తేడాతో గెలిచింది. GT నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని MI చేదించలేకపోయింది. 18.2 ఓవర్లలో 171 రన్స్ కే ఆల్ అవుట్ అయింది.
సూర్య 61, తిలక్ 43, గ్రీన్ 30 రన్స్ తో రాణించిన MIకి విజయాన్ని అందించలేకపోయారు. GT బౌలర్లలో మోహిత్ 5, షమీ 2, రషీద్ 2 వికెట్లు పడగొట్టగా, లిటిల్ 1 వికెట్ తీశారు. ఆదివారం చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, గుజరాత్ తో జరుగుతున్న క్వాలిఫైయర్ టు మ్యాచ్లో గాయపడిన ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ స్థానంలో విష్ణు వినోద్ కంకషన్ సబ్స్టిట్యూట్ గా బ్యాటింగ్ కు దిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి కంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా విష్ణు వినోద్ నిలిచాడు. ముంబై బౌలర్ జోర్డాన్ చెయి తగిలి ఇషాన్ కు గాయం కావడంతో ముంబై జట్టు కంకషన్ సబ్స్టిట్యూట్ గా వినోద్ ను పంపింది.