ఢిల్లీ లో భారీగా డ్రగ్స్ సీజ్.. నలుగురు అరెస్ట్..!

-

దేశ రాజధాని ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2వేల కోట్ల విలువైన 565 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే డ్రగ్స్ సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు 565 కిలోల కొకైన్ ను పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.2వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు అధికారులు.

ఈ భారీ కొకైన్ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి ఇద్దరూ అప్గానిస్తాన్ వాసులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో వారి వద్ద నుంచి నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ విచారించగా.. తాజా మాదక ద్రవ్యాల బండారం బయటపడింది. ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తాజాగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version