IAF: శత్రువులకు ఇక వణుకే.. 114 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్న ఇండియా

-

భారత దేశం ఆర్మీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైన్యం ఆధునీకీకరణ మరింత వేగంగా సాగుతోంది. దీంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ కింద సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటున్నాము. ఇటీవల కాలంలో పలు దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసేస్థాయికి ఇండియా చేరుకుంది. తాజాగా వియత్నాం వంటి దేశాలకు బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణులను ఎగుమతి చేస్తున్నాం. 

ఇదిలా ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందులో 18 విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పాటు 96 విమానాలను భారత్ లోనే తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు సమాయత్తం అవుతోంది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద మొత్తం 114 మల్లీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లను భారతీయ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో తయారు చేయనున్నారు. 96 విమానాలలో 36 విమానాలు దేశంలో తయారు చేయడమే కాకుండా ..వాటి చెల్లింపులను విదేశీ కరెన్సీ, భారతీయ కరెన్సీ రూపంలో చెల్లించేలా, మిగతా వాటికి పూర్తి స్థాయిలో ఇండియన్ కరెన్సీలోనే చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇండియా 36 రఫెల్ విమానాలు కొన్న తరువాత ఇదే బిగ్ డీల్.  బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, మిగ్, ఇర్కుట్ కార్పొరేషన్ మరియు డస్సాల్ట్ ఏవియేషన్‌తో సహా గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు టెండర్‌లో పాల్గొంటారని భావిస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news