World Cup 2023 FINAL : పిచ్ ఏ జట్టుకు అనుకూలమంటే?

-

CWC – 2023 : ఇవాల్టి ఫైనల్ లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ WCలో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఏ ఒక్క జట్టు 300 రన్స్ చేయలేకపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 315 రన్స్ చేస్తే గెలిచే అవకాశం ఉందని, చేదన కష్టమని పిచ్ క్యూరేటర్ తెలిపారు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ స్లో అయ్యి టర్న్ లభిస్తుందని చెబుతున్నారు.

India vs Australia ICC World Cup final prediction

ఇది ఇలా ఉండగా, టీమిండియా ఆటగాళ్లకు గుజరాత్ బీజేపీ నేత కెయూర్ ధోలారియ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వరల్డ్ కప్ 2023 విజేతగా భారత్ నిలిస్తే ఆటగాళ్లతో పాటు కూడా తలో ఫ్లాట్ గిఫ్ట్ గా ఇస్తానని పేర్కొన్నారు. రూ. 10 లక్షల విలువైన ఈ ఫ్లాట్లలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై బీసీసీఐని కూడా సంప్రదిస్తున్నామని వెల్లడించారు. క్రికెటర్లు తమ కుటుంబసభ్యుల పేరిట ఫ్లాట్ బదిలీ కావాలంటే చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version