సరిహద్దు వెంట స్వ‌ల్ప ఉద్రిక్త‌త : ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్..!

-

గ‌త మూడు నెల‌లుగా వాస్త‌వాధీన రేఖ వెంట భారత్, చైనా మధ్య ఉద్రిక్త‌ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణె ల‌డ‌ఖ్‌లోని లేహ్‌లో పర్యటించాలని నిశ్చయించుకున్నారు. రెండో రోజులో భాగంగా ఇవాళ కూడా ఆయన ప‌ర్య‌టిస్తున్నారు. సీనియ‌ర్ ఫీల్డ్ క‌మాండ‌ర్లు.. స‌రిహ‌ద్దు ప‌రిస్థితిపై ఆయ‌న‌కు వివరించారు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉన్న ఉద్రిక్త‌త‌ల గురించి ఆర్మీ చీఫ్ తెలుసుకున్నారు.

అలాగే ద‌ళాలు ఎంత వ‌ర‌కు స‌మాయ‌త్తంగా ఉన్నాయో ఆర్మీ చీఫ్‌కు విశ్లేషించ‌నున్నారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.. వాస్త‌వాధీన రేఖ వెంబడి ప‌రిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. దీనిని అంచ‌నా వేసి త‌గిన‌ట్లుగా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాము. దానిలో భాగంగానే ఎల్ఏసీ వెంట‌ బ‌ల‌గాల‌ను పెంచాము’ అని ఆయన తెలిపారు. అలాగే ఎటువంటి స‌వాళ్ల‌ను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news