ఇండియాలో కరోనా వ్యాక్సిన్ సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా…?

-

భారత్ లో కరోనా వ్యాక్సిన్ టీకాలకు సంబంధించి ఇప్పడు చాలా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ఏంటీ అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ చాలా కష్టపడుతుంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ ని ప్రజలకు అందించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం మొదలు పెట్టింది. వ్యాక్సిన్ కి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది ఏంటీ అనేది సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందించబడుతుంది.

టీకా కోసం అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, పంచాయతీ భవనం మరియు ఈ తరహాలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. అంటే టీకాను బూత్ వారీగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రస్తుతం ఉన్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యుఐపి) కు సమాంతరంగా నడుస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కరోనా టీకాను అందించే కార్యక్రమాలు అన్నీ కూడా… యాంటీ కరోనావైరస్ ఇనాక్యులేషన్ డ్రైవ్ కింద జరుగుతాయి. వీటిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ కి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. కరోనా వైరస్ యొక్క టీకాలకు అవసరమైన పత్రాలు ఒక్కసారి చూస్తే… టీకా జాబితాలో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి మరియు లబ్ధిదారులను ట్రాక్ చేయడానికి వారి ఆధార్ కార్డుతో అనుసంధానిస్తారు. వ్యక్తికి ఆధార్ కార్డు లేకపోతే, ప్రభుత్వం ఫోటో గుర్తింపు ద్వారా అందిస్తుంది.

వ్యాక్సిన్ ఎప్పుడు లభిస్తుంది ఏంటీ అనేది చూస్తే… నితి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ నాయకత్వంలో వ్యాక్సిన్ నిర్వహణపై కేంద్రం జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. టీకా నిల్వ మరియు పంపిణీ కోసం కమిటీ వివరణాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది. 2021 సంవత్సరం ప్రారంభం నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ భారతదేశంలో రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

లబ్ధిదారుల సమాచారం మొత్తం కూడా ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఇవిన్) కు చేరుస్తారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద, ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ఇప్పటికే 32 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ రోగనిరోధక కార్యక్రమాలలో ఉపయోగిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ అంటే ఏమిటి అంటే… టీకా స్టాక్, దాని లభ్యత, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వాటిపై వాస్తవ సమాచారాన్ని అందిస్తుంది. టీకా ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే… ఎన్నికల నిర్వహణ తరహాలోనే వివిధ దశల్లో ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news