కర్ణాటకలో పూర్తి స్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించింది. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖ బాధ్యతలతో పాటు కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, సమాచార, ఐటీ, మౌలికసదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు.
జి.పరమేశ్వరకు హోంశాఖ.. ప్రియాంక్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను కేటాయించారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ, వృద్ధులు, దివ్యాంగుల సాధికారిత శాఖలను అప్పగించారు. మధు బంగారప్పకు ప్రాథమిక, ఉన్నత విద్య శాఖ, రామలింగారెడ్డికి రవాణాశాఖ, దినేశ్ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ, సతీశ్ జర్ఖిహోళికి ప్రజా వ్యవహారాలు, హెచ్‌సీ మహదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖలను అప్పగించారు.