పచ్చి పల్లీలలో ఇంత రహస్యమా..? ఎన్ని లాభాలు అంటే…?

-

వేరుశెనగ: పచ్చి పల్లీలు ఆరోగ్యానికి చాలా మేలు చూస్తాయి. చాలా మంది పల్లీలను వంటల్లో వాడుతూ ఉంటారు. అలానే నానబెట్టుకుని తింటూ ఉంటారు.పచ్చి పల్లిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ మొదలైనవి. అలానే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి.

పచ్చిపల్లిలలో ఉండే మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండేందుకు పల్లీల తో అవుతుంది. ఇందులో ప్రోటీన్ ఫైబర్ హెల్ది ఫ్యాట్స్ ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పైగా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

అతిగా ఆహారం తీసుకునే అలవాటు ఉంటే కూడా ఇవి బయట పడేస్తాయి. అదే విధంగా పచ్చి పల్లీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ఎక్కువ ప్రభావం చూపదు పచ్చి పల్లీలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది. పైగా స్నాక్స్ గా దీనిని మనం తీసుకోవచ్చు. ఓట్ మీల్ లేదంటే యోగర్ట్ తో పాటుగా కూడా తీసుకోవచ్చు అయితే పదే పదే పల్లీలను తీసుకోవడం వలన రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొంతమందికి ఎలర్జీ ఉంటుంది అటువంటి వాళ్ళు తీసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి లిమిట్ గా తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news