వికసిత్ భారత్ లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. వరుసగా ఏడోసారి పద్దును ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. మరి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఏంటంటే..?
నిర్మలమ్మ పద్దులో కీలక ప్రకటనలు ఇవే..
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంపు. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు.
బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతానికి తగ్గింపు. ప్లాటినమ్‌పై 6.4శాతానికి కుదింపు.
ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ. 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు.
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు.
మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు. విద్య, ఉపాధి, నైపుణ్యాలభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు
నిరుద్యోగులకు మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సహకాలు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు.