ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి నేడే చివరిరోజు

-

ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందేనని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఈ పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు నేటితో ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

నిజానికి పాన్‌-ఆధార్‌ లింక్‌కు గడువు ఎప్పుడో ముగిసింది. అనంతరం రూ.1000 అపరాధ రుసుముతో తొలి మార్చి 31, ఆ తర్వాత జూన్‌ 30 వరకు అదనపు గడువు కల్పించారు. ఇప్పుడు ఆ సమయం కూడా నేటితో ముగుస్తోంది. ఈ గడువును మరోసారి పెంచే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు

అనుసంధానం చేశామా… లేదా అన్న అనుమానం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో లింక్‌ ఆధార్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇది వరకు అనుసంధానం చేసి ఉంటే.. చేసినట్లు సందేశం వస్తుంది. లేదంటే ఫైన్‌ చెల్లించి అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఇస్తూ ఆప్షన్లు కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news