యోగి లాంటి ముఖ్యమంత్రి కావాలి- సాక్షి తండ్రి జనక్ రాజ్ ఆకాంక్ష

-

ఉత్తర ప్రదేశ్ లో అయితే ఇప్పటికే న్యాయం జరిగి ఉండేది… సాక్షి తండ్రి జనక రాజ్ భావోద్వేగభరితమైన మాట ఇది. అన్యాయాలను,అక్రమాలను,దౌర్జన్యాలకు సహించబోదని చెప్తూ మహిళలకు ఇప్పుడు యూపీలోనే ఎక్కువ రక్షణ ఉందని జనక్ రాజ్ చెప్తున్న మాట. ఢిల్లీలోని రోహిణి కోర్ట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే …. షహబాద్ యువకుడి చేతిలో సాక్షి దారుణ హత్యకు గురై 30 రోజులు దాటింది. ఈ సందర్భంగా రోహిణి కోర్టులో చార్జిషీటును సమర్పించారు. జనక్‌రాజ్ భావోద్వేగానికి గురయ్యారు. సాక్షి దూరమై నేటికి నెల రోజులైందని చెప్తూ ఈ నెల రోజులు కంటికి నిద్ర లేదని ఆవేదన చెందారు. యూపీలో ఉండి ఉంటే వెంటనే న్యాయం జరిగేదని అన్నారు.

యూపీలో జనాకర్షక నేతగా గుర్తింపు పొందిన యోగీ రాష్ట్ర తలరాతను మార్చడంలో పూర్తిగా విజయం సాధించారనే చెప్పాలి. ఇప్పుడు యూపీ ప్రశాంతంగా ఉందంటే అందుకు యోగీ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు ప్రధాన కారణం.అవినీతి,రౌడీయిజం,అంధకారం లేని ఉత్తరప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తూన్నారు యోగి. ఈ పరిస్థితులే తనకు దేశ వ్యాప్తంగా పేరు తీసుకువచ్చింది. మహిళలు ఇప్పుడు యూపీలో ప్రశాంతంగా ఉన్నారంటే యోగీ ఉన్నాడన్న ధైర్యమే. శాంతి భద్రతలపై యోగి ప్రత్యేక దృష్టి సారిస్తు కేవలం ఉత్తరప్రదేశ్‌ ప్రజల ఆదరాభిమానమే కాదు దేశ ప్రజల విశేష ఆదరణ కూడా సంపాదించారు. సామాన్యుల వరకు ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది.

yogi

తాజాగా సాక్షి తండ్రి జనక్ రాజ్ చేసిన వ్యాఖ్యలు యూపీలో మహిళలు ప్రభుత్వం నుంచి పొందుతున్న కట్టుదిట్టమైన భద్రతకు అద్దం పడుతున్నాయి.యూపీలో ఉంటే వెంటనే న్యాయం జరిగేదని ఆదిత్యనాథ్ ని తలచుకున్నారు.యోగి లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని చాలా రాష్ట్రాలు కోరుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలలోని నేతలు యోగిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.గత నెల రోజులుగా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయానని చెప్పిన జనక్ రాజ్,సాక్షి హంతకుడికి ఉరిశిక్ష పడే రోజు మాత్రమే తన కుటుంబం ప్రశాంతంగా నిద్రించగలుగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news