ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్‌ జోషీ

-

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం రోజున జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో 24 గంటల్లో జరగనున్న పోలింగ్ కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు  హోం ఓటింగ్ కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా..  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హమీద్‌ అన్సారీ గురువారం, మన్మోహన్‌ సింగ్, మురళీ మనోహర్‌ జోషీ శుక్రవారం, ఆడ్వాణీ శనివారం ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. భారత ఎన్నికల కమిషన్‌ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచే ఓటేసే సౌకర్యాన్ని ప్రారంభించగా ఈ అవకాశం దిల్లీ ఓటర్లకు మే 16వ తేదీ (గురువారం) నుంచి మే 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో మొత్తం 5,406 మంది ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. మే 25వ తేదీన దిల్లీలో పోలింగ్‌ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version