కేంద్రం ‘మిల్లెట్‌ లంచ్‌’‌లో మోదీ సహా ప్రముఖుల సందడి

-

భారత్‌ చొరవతో 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ఐరాస ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలందరికీ చిరుధాన్యాలతో ప్రత్యేక మిల్లెట్‌ లంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ లంచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సహా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, మల్లిఖార్జున ఖర్గే, అధిర్‌ రంజన్‌ చౌధరి, పలువురు కేంద్రమంత్రులు, ఉభయ సభల ఎంపీలు హాజరయ్యారు.

ప్రఖ్యాత చెఫ్‌లను రప్పించి వారితో చేయించిన ఈ చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నేతలంతా ఇష్టంగా ఆరగించారు. చిరుధాన్యాలు తినే సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ లంచ్‌లో ఏర్పాటు చేసిన మెనూ నోరూరిస్తోంది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాదిగా గుర్తించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ వంటకాల లంచ్‌కు హాజరైనట్టు తెలిపారు. పార్టీలకు అతీతంగా నేతలంతా ఈ లంచ్‌కు హాజరుకావడం ఆనందంగా ఉందని నేతలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news