ఎంపీ మీనాక్షి లెఖీకి కరోనా..!

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ఈ మహమ్మారి బారిన న్యూఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి లెఖీకి పడ్డారు.

అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యం ఉన్నానని ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తులు కొవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాలని ఆమె ట్విట్టర్లో అభ్యర్థించారు. తాము కలిసి పోరాడతాం.. కరోనా జయిస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షలో ఆమెతో పాటు మరో 16 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.