రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కన్ను మరో రంగంపై పడింది. పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ ఇలా అన్నింట్లోనూ విస్తరించిన ఇండస్ట్రీని ఇప్పుడు మరో మెట్టు ఎక్కించే పనిలో పడ్డారు. తమ రిటైల్ వెంచర్స్‌లోని ఎఫ్ఎంజీసీ కంపెనీల స్వతంత్ర బ్రాండ్‌తో ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని సమాచారం.
గతేడాది గుజరాత్‌లోనే రిలయన్స్ ఈ బ్రాండ్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోందట. ఇక ఐస్‌క్రీమ్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్లో కూడా తప్పక పోటీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కంపెనీ ఈ ఉత్పత్తిని తమ ఎఫ్ఎంజీసీ విభాగంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందట. మరోవైపు గుజరాత్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీతో చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ఈ వేసవిలోనే కంపెనీ తన సొంత ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.