ప్రాజెక్ట్ చీతాలో భాగంగా గతేడాది సెప్టెంబర్ లో నబీబియా నుంచి 8 జీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మనదేశంలో 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చివరి చీత చనిపోయింది. ఆ తర్వాత వీటి ఆనవాళ్లు మనదేశంలో కనిపించలేదు. 74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ మన దేశంలోకి వచ్చాయి. మన దేశానికి తీసుకువచ్చిన చీతాల్లో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి.
ప్రస్తుతం వీటి వయస్సు 5 ఏళ్ల నుంచి ఏడు ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే ఇందులో ఓ చీతా 4 పిల్లలకు జన్మనిచ్చినట్లు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ” గతేడాది సెప్టెంబర్ 17న ఇండియాకు తీసుకు వచ్చిన ఓ చీతాకు నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. గతంలో జరిగిన పర్యావరణపరమైన తప్పులను సరిదిద్దుతూ.. జీతాలు భారత్ కు తిరిగి రావడంలో కృషి చేస్తున్న బృందానికి అభినందిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
Congratulations 🇮🇳
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023