ములుగు జిల్లాలో విషాదం.. కలుషిత నీరు తాగి 25 మంది కూలీలకు అస్వస్థత

-

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి 25 మంది మిర్చి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొల్లగూడెం గ్రామంలో మిర్చి కోస్తున్న కూలీలు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పక్క మిర్చి చేనులోని వాటర్ తెచ్చుకొని తాగారు. దీంతో వెంటనే అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

కలుషిత నీరు(డ్రిప్ క్లీనింగ్ ఆసిడ్) తాగిన రైతులు వాంతులు చేసుకున్నారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిర్చి తోటలో డ్రిప్ క్లీనింగ్ చేసేందుకు క్రిమిసంహారక మందు కలిపిన నీరు తాగటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు. విషమంగా ఉన్న కూలీలను మెరుగైన వైద్యం కోసం బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news