Ola Bikes: స్కూటర్ రిపేర్ చేయలేదు..ఓలా షోరూంనే తగలబెట్టాడు !

-

కర్ణాటక దారుణం జరిగింది. ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ వాహనదారుడు. కర్ణాటక కలబురగిలో నదీమ్(26) అనే యువకుడు తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయని సమాచారం అందుతోంది.

Ola Electric Dissatisfied Customer Burns Down Showroom In Karnataka

ఈ సంఘటన వివరాలు ఒక సారి పరిశీలిస్తే… కర్ణాటకలోని కలబుర్గిలో ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌కు నిప్పుపెట్టిన నిందితుడిని మహ్మద్ నదీమ్‌గా గుర్తించారు. ఈ ఘటన సెప్టెంబర్ 10న జరిగినట్లు సమాచారం. తన ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ ను చాలాసార్లు రిపేర్ చేయకపోవడంతో నదీమ్ వాపోయాడు. హుమ్నాబాద్‌ రోడ్డులో ఉన్న షోరూమ్‌ కు పెట్రోల్‌ తీసుకొచ్చి నిప్పుపెట్టాడు. పలు వాహనాలు, విడిభాగాలు, ఇతర సామగ్రి ధ్వంసమై రూ.8.5 లక్షల నష్టం వాటిల్లింది. అనంతరం నిందితుడు నదీమ్‌ను చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version