మన దేశంలో పెట్రోల్ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు కు పెరగడమే తప్ప.. పెట్రోల్ మరియు డిజీల్ ధరలు తగ్గడం లేదు. ఇప్పటికే పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. అటు డీజిల్ కూడా.. వందకు చేరనుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర సర్కార్.
కేంద్ర తీసుకోబోయే నిర్ణయంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం పెట్రోల్, డీజిల్ సహా మరికొన్నింటిపై పన్నులు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డాక నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.