FLASH : శ్రీశైలం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..!

-

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంటులో అగ్నిప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు, దారి తీసిన పరిస్థితుల్ని వెలికి తీయాలని సూచించారు. కాగా, మృతి చెందిన 9 మందిలో ఇప్పటికే రెస్క్యూ టీం ఐదుగురి మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసు‌కొచ్చారు. మిగిలిన నాలుగు మృత‌దేహాల‌ను తీసుకొచ్చేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 8 మంది సుర‌క్షితంగా బ‌య‌టప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news