బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసు రద్దు..? : దిల్లీ పోలీసుల నివేదిక

-

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్​ గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. భారత మహిళా రెజ్లర్లు.. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని.. అసభ్యకరంగా ప్రవర్తించాడని దిల్లీలో ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయంపై ఫోకస్ పెట్టి కేంద్రం.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు షురూ చేసిన దిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ వేధించాడనడానికి సరైన ఆధారాలు చూపాలని రెజ్లర్లను కోరారు.

అయితే తాజాగా బ్రిజ్ భూషణ్​పై నమోదైన పోక్సో కేసును ఎత్తివేసేందుకు అనుమతించేలా దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతూ నివేదిక సమర్పించారు. రెజ్లర్లను వేధించారన్న కేసులో 500 పేజీల ఛార్జ్​షీట్ దాఖలు చేసిన పోలీసులు.. మైనర్ ఆరోపణలపై నమోదైన కేసును రద్దు చేయాల్సిందిగా కోరారు. మైనర్ రెజ్లర్ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఛార్జ్​షీట్​లో పేర్కొన్నారు. బాలిక, ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోక్సో కేసు రద్దుకు సంబంధించి నివేదిక సమర్పిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు, మిగతా రెజ్లర్ల ఆరోపణలపై ఛార్జ్​షీట్ నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news