మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయింది దొరగారు – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కరోనా కంటే మించిన వైరస్ లు వస్తాయని జ్యోస్యం చెప్పే దొర.. తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే ! అంటూ ఎద్దేవా చేశారు. మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడించే అతి పెద్ద వైరస్ అని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారి మీ పాలన అంటూ దుయ్యబట్టారు.

ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ మీరని తీవ్ర విమర్శలు చేశారు. “కరోనా తో పోరాడి నిలిచామేమో కానీ.. BRS వైరస్ కంట పడితే ఖేల్ ఖతం దుకాణం బంద్. ఇక రాష్ట్రంలో వైద్యాన్ని ఉద్ధరించినట్లు ఉద్దెర మాటలు చెప్పే దొర గారు.. నిమ్స్ విస్తరణకు కొబ్బరి కాయ కొట్టారు సరే.. గత శంకుస్థాపనల సంగతి ఏంటో జర చెప్పు సారు. 15 వందల కోట్లతో ఉస్మానియా దవాఖానకు కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ..? నగరం నలుమూలల నాలుగు పెద్దాసుపత్రులు ఎక్కడ..?

అక్కడ కార్పొరేట్ వైద్యం ఏమాయే.. ఎయిమ్స్ ను మించిన ట్రీట్మెంట్ కనపడదాయే. కొబ్బరికాయ కొట్టి 14 నెలలైనా పునాదిరాయి పడక పాయె. దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు. కొబ్బరికాయలు, శంకుస్థాపనలు ఇదే మీరు 10 ఏళ్లలో సాధించిన ఆరోగ్య తెలంగాణ. మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news