ఈ మూడు రాష్ట్రాల్లో 7 విడుతల్లో పోలింగ్..!

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో  మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా ఒకేవిడతలో దాదాపు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, ఛండీఘడ్, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్ష్యదీప్, లఢక్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి.

రెండు విడుతల్లో కర్నాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్,  మూడు విడుతల్లో ఛతీస్ గడ్, అస్సాం, నాలుగు విడతల్లో ఒడిశా, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్, 5 విడుతల్లో మహారాష్ట్ర, జమ్మూ అండ్ కశ్మీర్, ఏడు విడుతల్లో ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనుంది. రాష్ట్రాల విస్తీర్ణం, హింసాత్మక మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version