కాలుష్య కోరల్లో చిక్కుకుని దేశ రాజధాని దిల్లీ మరోసారి విలవిలలాడుతోంది. దిల్లీలో వాయి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దిల్లీలో శుక్రవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 329గా నమోదైంది. నగరంలో అత్యధికంగా అత్యధికంగా ఆన్‌విహార్‌లో 834గా రికార్డయింది. రోహిణి, ఝిల్‌మిల్, సోనియా విహార్‌లో గాలి నాణ్యత పేలవమైన స్థాయికి చేరుకుంది. ఇక దిల్లీ రాజధాని ప్రాంత పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో కూడా గాలి నాణ్యత పడిపోయింది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయి.