BREAKING : రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. రాహుల్ గాంధీపై రెండేళ్ల పాటు అనర్హత వేటు వేశారు.

ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు. దీంతోకాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. మరి దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా.. పరువు నష్టం కేసులో ఇటీవల గుజరాత్ లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. “దొంగలు అందరికీ మోడీ ఇంటి పేరు” అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వాక్యాలపై సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని కోర్టు దోషిగా నిర్ధారించి, ఈ సెక్షన్ కింద గరిష్టంగా రెండేళ్ల శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో తీర్పు వెలువడే ముందు రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పోస్టర్ ను ఏర్పాటు చేసింది. దొంగలు అందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు అయింది. బిజెపి ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్నేష్ మోడీ చేసిన ఫిర్యాదు పై కేసు నమోదు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news