దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఐదు రోజుల వరకు వరకు భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా భారత వాతావరణ విభాగం తెలియజేసింది. అలాంటి సమయాల్లో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించింది. దేశంలోని హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖాండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మరి కొన్నిఈశాన్య రాష్ట్రాలలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో నేడు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర లోని సముద్ర తీరాలలో అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం వద్ద కూడా ఇప్పటికే నీరు వచ్చి చేరుకుంటుంది. పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం ఇప్పటికే 6.89 మీటర్లకు చేరుకుంది.