మరో ఎనిమిది రోజుల సభ జరగాల్సి ఉన్నా రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. అక్టోబర్ 1 వరకు జరగాల్సిన సమావేశాలను కరోనా కారణంగా నేటితో ముగించేశారు. అన్ని రాజకీయ పార్టీల కోరిక మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నిరవధికంగా వాయిదా వేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా 10 రోజుల పాటు రాజ్యసభ సమావేశాలు జరిగినట్టయింది.
1952 సంవత్సరం తర్వాత అతి తక్కువ రోజులు రాజ్యసభ కార్యక్రమాలు జరిగింది ఇప్పుడే. రాజ్యసభ గణాంకాల సమాచారం ప్రకారం, 1952-2018 వరకు, 252 వ సెషన్ లో కేవలం 10 రోజులు మాత్రమే సభ జరగగా, ఇక ఇప్పటివరకు జరిగిన మొత్తం 69 వర్షాకాల సమావేశాలలో రెండవ అతి తక్కువ రోజులు జరిగిన రాజ్యసభ సమావేశాలు ఇవేనని చెబుతున్నారు.