రాజస్థాన్ కొత్త సీఎంగా సచిన్ పైలట్ ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు రాజస్థాన్ లో అధికార మార్పుకు మార్గం సుగమం చేస్తోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అశోక్ గెహ్లాట్ స్థానంలో తదుపరి సి.ఎమ్ గా సచిన్ పైలట్ ను నియామకం చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏల ( సి.ఎల్.పి) సమావేశం జరుగనుంది.
ఈ సమావేశానికి పరిశీలకులుగా నియామకమయ్యారు మల్లిఖార్జున్ ఖార్గే. రాజస్థాన్ ఇంచార్జ్ అజయ్ మకన్ తో సహా, మల్లిఖార్జున్ ఖార్గే కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరౌతున్నారు. “ఒకరికి ఒక పదవి మాత్రమే” అని ఆమోదించిన ఉదయపూర్ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుబడి ఉండాలంటూ రాహుల్ గాంధీ స్పషం చేయడంతో, రాజస్థాన్ కొత్త సీఎంగా సచిన్ పైలట్ ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం సమయానికి దీనిపై క్లారిటీ రానుంది.