లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపుర్ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చికుర్‌బత్తి- పుస్బాక అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్ బలగాలు సంయుక్తంగా యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరపా భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు.
ఘటనాస్థలం నుంచి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. బీజాపుర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండగా.. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాంటీ-నక్సల్ ఆపరేషన్ చేపట్టారు.