ప్రధాని మోదీ పాలనపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి రూటే వేరు. తనకు నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పే తత్వం ఆయనది. అంశాల వారీగా సొంత పార్టీ బీజేపీని కూడా ప్రశ్నిస్తారు సుబ్రమణ్య స్వామి. ఇటీవల కాలంలో బీజేపీ పార్టీపై వరసగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో బీజేపీని వదిలి టీఎంసీలో చేరుతారనే వార్తలు కూడా వచ్చాయి. బీజేపీలో ఉంటూనే… ఇతర పార్టీల నేతలను కలుస్తుంటారు. గతంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా సుబ్రమణ్య స్వామి వెళ్లి కలిశారు. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శిస్తున్న కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి. 8 ఏళ్ల పాలనలో ఆర్థిక ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సాధించడంలో మోదీ విఫలమయ్యారని.. 2016 నుంచి వృద్ధి రేటు ఏటా క్షీణించిందని… జాతీయ భద్రత కూడా బలహీన పడిందని… మోదీకి చైనా గురించి అవగాహన లేదని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి అవకాశం ఉందని కానీ ఈ విషయంపై మోదీకి అవగాహన లేదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news