పెళ్ళికాని మహిళలు కూడా అబార్షన్ చేసుకోవచ్చు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన సంచలన తీర్పు ఇచ్చింది. సమాజిక కట్టుబాట్లు,నైతిక ఉల్లంఘనలకు తొలి అడుగు వేసింది సుప్రీంకోర్టు. అవివాహిత స్త్రీలు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు…భార్యతో బలవంతపు సెక్స్ రేప్ కిందికే వస్తుందని స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

భార్య కు బలవంతపు సెక్స్ ద్వారా కలిగే గర్భాన్ని అబార్షన్ చేసుకునే అధికారం ఉంది.ఎవరైనా 24 వారాలలోపే అబార్షన్ కు అనుమతి ఉందని తెలిపింది.  ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉంది కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలనే నిబంధన ఏమీ లేదని వెల్లడించింది సుప్రీం కోర్టు.