పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఓ గర్ల్స్ హాస్టల్ లో ఓ విద్యార్థిని 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ యువకుడికి పంపింది. ఆ యువకుడు ఆ వీడియోని ఇంటర్నెట్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ కావడంతో ఎనిమిది మంది విద్యార్థినులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో హాస్టల్ అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు లీకైన ఘటన క్యాంపస్ లో ఉద్రిక్తతంగా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు వీడియో తీసిన విద్యార్థినిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆందోళన చేస్తున్న విద్యార్థులు శాంతించాలని కోరారు.
అటు ఇది చాలా తీవ్రమైన ఘటన అని, దీనిలో భాగమైన దోషులందరికి కఠిన శిక్ష పడుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనలో నిందితురాలి కు సంబం ధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ
— Shanu XD (@shanu00001) September 17, 2022