లేహ్‌లో మంచు వర్షం .. చిక్కుకున్న వంద‌లాది మంది ప‌ర్యాట‌కులు

-

ల‌డాఖ్‌లోని లేహ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. వేసవిలో కాస్త సేద తీరేందుకు లేహ్​ టూర్​కు వెళ్లిన పర్యాటకులకు మంచు వర్షం చుక్కలు చూపిస్తోంది. మంచు కురుస్తుండటం వల్ల ఈ క్రమంలో అక్కడ వందల మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. లేహ్‌లోని చాంగ్లా యాక్సిస్ వ‌ద్ద చిక్కుకున్న ప‌ర్యాట‌కుల్ని భ‌ద్ర‌తా ద‌ళాలు ర‌క్షించాయి. శుక్ర‌వారం సాయంత్రం రెస్క్యూ ఆప‌రేష‌న్ చేపట్టారు. భారీ సంఖ్య‌లో టూరిస్టులు రావ‌డంతో ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ల‌డాఖ్ పోలీసు శాఖ‌కు చెందిన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, గ్రీఫ్ రెస్క్యూ బృందాలు కూడా యాక్టివ్‌గా ఉన్నాయి. అన్ని ద‌ళాలు ఒక్క‌టిగా ప‌నిచేయ‌డంతో.. చాంగ్లా యాక్సిస్ వ‌ద్ద ఉన్న ప‌ర్యాట‌కుల్ని లేహ్‌కు సుర‌క్షితంగా త‌ర‌లించారు.

గ‌త రెండు రోజుల నుంచి లేహ్​లో భీక‌రంగా మంచు కురుస్తోంది. దీంతో అక్క‌డ ప‌ర్యాట‌కుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. మంచుగ‌డ్డలు పేరుకుపోవ‌డంతో జారిప‌డుతున్నారు. రోడ్లు కూడా స్లిప్ప‌రీగా మారాయి. చాంగ్లా టాప్ వ‌ద్ద అనేక వాహ‌నాలు నిలిచిపోయాయి. ట్యాక్సీలు, ప్రైవేటు కార్లు క‌ద‌ల‌లేని స్థితిలో ఉండిపోయాయి. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌ర్యాట‌కుల త‌మ టూర్‌ను ప్లాన్ చేసుకోవాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version